తెలంగాణ

తుంగతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి..

ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన హైద్రాబాద్ తెలంగాణ కానుక తుంగతుర్తినియోజకవర్గంలో కొత్తగా ప్రకటించిన మండల స్థాయి కాంగ్రెస్ కమిటీలను వ్యతిరేకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ పదవులు ఇవ్వడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మండల కమిటీలను రద్దు చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలతో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీని కాపాడాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

ప్రథమ పౌరులకు పాఠాలు.. అభివృద్ధికి సోపానాలు.

బయ్యారం,తెలంగాణ కానుక,జులై 8. గ్రామ సమస్యలు,పరిపాలన,అభివృద్ధి తదితర అంశాలపై సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం బుధవారం మొదలైంది. జిల్లాలో గ్రామ పంచాయతీల ప్రథమ పౌరులకు మొదటి విడత ఐదు శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ అధికారి దివ్య,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క,ఎంపీ బలరామ్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొని సర్పంచ్ లకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్,జగ్గుతండా సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ పాల్గొని బయ్యారం,జగ్గుతండా గ్రామపంచాయతిలలో పలు సమస్యలపై మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.

వైభవంగా శ్రీరామ దేవాలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు

ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో కొలువై ఈ కార్య సిద్ధి సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షిక (బ్రహ్మోత్సవాలు) వేడుకలు గత మూడు రోజుల నుండి ఆలయ చైర్మన్ ట్రష్టి బి.నాగరాజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. బుధవారం శుభ్రాత సేవ నిత్యారాధన, సేవా కాలం శశాత్తుమోరై శాంతి పాఠం వేద విన్నపాలు, ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, నిత్యా ఆహవనం, నిత్య పూర్ణవతి బలిహరణ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ నూతన స్వర్ణ కవచ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయంలోని గర్భగుడికి నూతనంగా ఏర్పాటు చేసిన వెండి తలుపులను

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవికి రాజీనామా చేయాలి

సదాల వెంకట్ రెడ్డి రాజేంద్రనగర్ : తెలంగాణ కానుక బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని రాజేంద్రనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సదాల వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం శివరాంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవికి రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పేరుతో ఇప్పటికే రెండు పార్టీలు మారిన ఎమ్మెల్యేప్రజల కోసం కాకుండా తన సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ తాను ఇప్పటికీ బిఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీలోకి మారడం ప్రకాష్‌గౌడ్‌కు పరిపాటిగా

ఏబీవీపీ బషీర్బాగ్ నగర శాఖఆధ్వర్యంలో “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్,

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆలియా జూనియర్(బాలుర) కళాశాల ఆధ్వర్యంలో జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, ఏబీవీపీ కేవలం విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేసే సంస్థ మాత్రమే కాదని, సమాజ నిర్మాణంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్న జాతీయ విద్యార్థి సంస్థ అని అన్నారు. ఏబీవీపీ పరివర్తనాత్మక ఆలోచనలతో విద్యార్థి క్షేత్రంలో సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సామాజిక బాధ్యతా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మమత, సింధూరి, రఘునందన్, రాంప్రసాద్,

సినిమా

రాజకీయాలు

వీడియోలు